Duck hunt

Well Come

Free

Telugu 👨‍💻 World

KingofTelugu.Wap.Sh

By ψ(J.Chandrashekhar)
Home chatbook Entertainment OnlineReadStoriesLive Radio AudioPlayer Live Tv Telugu Books CalenderGotramHtml,Js,Css ToolsAI links Blog Kingoftelugu.wap.sh About Me
     వేదములలో వర్ణించబడిన ‘ముక్తి’.

ఈ వ్యాసంలో మనం ముక్తి లేదా మోక్షం అనే అంశాన్ని అర్థం చేసుకుందాం. పూర్తి అవగాహన కొరకు ఈ వ్యాసాలను కూడా దయచేసి చదవగలరు – Vedic God, Soul మరియు Worship.

(పూర్తిగా చదవడం వల్ల ఒక ఆధ్యాత్మిక వ్యాసంలో సాహసవంతుడైన మహా రాణా ప్రతాప్ చక్రవర్తి చిత్రం ఎందుకు జత చేయబడిందో అర్థమవుతుంది.)

ప్ర: ముక్తి లేదా మోక్షము అనగానేమి? జ: ముక్తి అంటే స్వేచ్ఛ.

ప్ర: ఎటువంటి స్వేచ్ఛ? జ: ముక్తి అనేది అన్ని ఆత్మలూ కోరుకునే స్వేచ్ఛ. వేరే విధంగా చెప్పాలంటే దుఃఖము మరియు బాధల నుండి స్వేచ్ఛను పొందటాన్ని ముక్తి అనవచ్చును.

ప్ర: ఇటువంటి స్వేచ్ఛ లభించిన తరువాత ఏమవుతుంది? జ: ఇటువంటి స్వేచ్ఛ లబించిన తరువాత, ఆత్మ అమితానందపు అనుభూతిని పొందుతూ ఈశ్వర (దేవుడు/పరమాత్మ) అనుగ్రహము/ స్పూర్తితో జీవిస్తుంది. ఎవరైనా పొందగల అత్యంత సంతృప్తికరమైన ఆనందమయమైన స్థితి ఇది ఒక్కటే. చాలా మంది పొరపాటుపడి తప్పుగా నమ్ముతున్న ‘నిద్ర’ లేదా ‘సుషుప్తి’ వంటి అవస్థలను ముక్తి అనుట సమంజసము కాదు. ఇది నిద్రకు పూర్తిగా వ్యతిరేకమైనది – అదొక సాధించ వీలైన ఉత్కృష్టమైన చైతన్య స్థితి.

ప్ర: అయితే ఈశ్వరుడు (పరమాత్మ) మనలోనే ఉన్నాడు కదా. కనుక మనము ఇప్పటికే ఈశ్వర స్పూర్తితో అనుగ్రహము పొందుతూ జీవిస్తున్నాము కదా. మరి ఈ ముక్తి ఏ విధంగా విశిష్ఠమైనది? జ: ఈశ్వరుడు మరియు ఆత్మలకి సంబంధించిన చర్చలను మననం చేసుకుంటే, ఆత్మకు ‘సంకల్పము’ చేసే స్వేచ్ఛ మరియు పరిమిత జ్ఞానం ఉన్నవని మనము నిర్థారణకు వచ్చాము. ఎప్పుడెప్పుడు ఈ ఆత్మ సంకల్ప బలమును సరిగ్గా ఉపయోగించి అజ్ఞానాన్ని పారద్రోలుతుందో, అప్పుడది ఇంకా ఎక్కువ అమితానందమును పొందుతూ ఈ సృష్టి ఉద్దేశముతో/ప్రయోజనముతో సారూప్యం చెందుతుంది. అందుచేత ఏ మార్గములో వీలయితే అందులో ఈశ్వరుడిని అనుకరిస్తూ, ఈ సృష్టి యొక్క సంపూర్ణ ప్రయోజనముతో/ఉద్దేశముతో సహకరించే విధముగా నడుచుకోవలెనని ఈ ఆత్మకు సూచించబడినది.

జీవిత లక్ష్యం ఏమిటంటే ఈ ఆత్మను ఈ సృష్టి యొక్క ఉద్దేశముతో సారూప్యానికి వచ్చేందుకు అనువైన పనులు చేయుటకు సంసిద్ధం చేయటమే. ఈ సారూప్యత ఒక అత్యున్నత చరమ స్థాయికి చేరిన తరువాత ఇక ఒక ఆత్మకు మళ్ళీ జన్మించేందుకు ఎటువంటి అవసరమూ ఉండదు. ఆ విధంగా అది ఈ జనన మరణ చక్రము నుండి, సుఖ దుఃఖాల నుండి స్వేచ్ఛను పొంది అత్యంత అమితానందాన్ని పొందుతుంది.

కనుక, ముక్తి అంటే మన అన్ని కర్మలను ఈ సృష్టి ప్రయోజనము/ఉద్దేశముతో సారూప్యత కలిగేలా నిర్వర్తించడమే (చేయటమే). ఈశ్వరుడు మనల్ని ఎల్లప్పుడూ ఉత్తేజపరుస్తూ, స్పూర్తినిస్తూ, మన వెంటే ఉండటమే కాక మనయందు కూడా ఉన్నాడు. కాని ఎప్పుడు మనం ఈ విషయాన్ని తెలుసుకొని తదనుగుణంగా నడచుకుంటామో, అప్పుడు మనకు ముక్తి లభిస్తుంది.


ఇప్పుడు మొదటి ప్రశ్నకి సమాధానం విచారణ చేద్దాం, మనమిప్పుడు ఆత్మ యొక్క లక్షణాలను ఈశ్వరుడితో మరియు ప్రకృతితో పోల్చి చూద్దాం.

ప్రకృతి ‘సత్‘ – అది ఉనికిలో ఉంటుంది,

ఆత్మ ‘సత్‘ మరియు ‘చిత్‘ – అది ఉనికిలో ఉండి చైతన్యముతో (ఎరుకతో) ఉంటుంది (జీవించడం, విషయాలను తెలుసుకోవడం, కదలడం వంటివి),

ఈశ్వరుడు ‘సత్‘, ‘చిత్‘ మరియు ‘ఆనందము‘ – ఉనికిలో ఉంటాడు, చైతన్యము ఇంకా అమితానందమును కలిగియుంటాడు.

మరి ఆత్మ ఆనందమును/సంతోషమును అంతర్గతంగా (స్వతహాగా) కలిగియుండదు. అది కర్మల ద్వారా ఆనందమును పొందాలి. ఈశ్వరుడికి ఆనందము ఉన్నది కనుక, దీని అర్థమేమంటే ఈశ్వరుడిని చేరుటకు అది ప్రయత్నించాలి.

ఇప్పుడు వైదిక తత్వంలోని ఇంకొక ముఖ్యాంశానికి వద్దాం. “జ్ఞానం = ఆనందం“.

ఈశ్వరుడికి అపరిమితమైన జ్ఞానం ఉంది కనుక, అతనికి అపరిమితమైన ఆనందమూ ఉన్నది.

అయితే ఆత్మకు పరిమిత సామర్థ్యము మరియు పరిమిత జ్ఞానము ఉన్నాయి. ఈ పరిమితి, ఈశ్వరుడిచే నిర్వహించబడే కర్మ సిద్ధాంతమును అనుసరించి, ఆత్మ చేయు కర్మలను బట్టి మారుతూ ఉంటుంది.

కనుక ఆత్మ ఆనందమును పొందుటకు ఉన్న ఏకైక మార్గమేమనగా అది సరియైన కర్మలను చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆ పరిమితులను తొలగించుకోవటమే.

ఇటువంటి కార్యనిర్వహణ పద్ధతి ఈ క్రింది విధంగా ఉంటుంది:

కర్మలు సంస్కారాలను (ప్రవృత్తులు లేక అలవాట్లు) సృష్టిస్తాయి మరియు సంస్కారాలు ఆత్మ యొక్క పరిమితులను నిర్ణయిస్తాయి. అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే ఒక పనిని చేసిన వెంటనే, అది ఒక సంస్కారాన్ని సృష్టిస్తుంది. ఈ సంస్కారము మీరు మరలా అటువంటి సందర్భములో అదే పనిని మళ్ళీ చేసే సంభావ్యతను (అవకాశము/ తరచుదనము/ పునరావృత లను)పెంచుతుంది. కనుక మీరు చెడ్డ పనులు చేస్తే – మోసము, ద్వేషము వంటివి – అవే పనులు మీరు మళ్ళీ మళ్ళీ చేయుటకు సంభావ్యత పెరుగుతుంది. ఇది మీ సామర్థ్యము యొక్క పరిమితులను తగ్గించటం వల్ల మీకు జ్ఞానము తగ్గిపోయి ఆనందమూ తగ్గిపోతుంది. ఆ విధంగా మీరు ముక్తి నుండి ఒక్కొక్క అడుగు దూరమౌతారు.

అయితే మీరు మంచి పనులు చేసినట్లయితే – దయాభావం, విశ్లేషణ చేసి సత్యమును మాత్రమే అంగీకరించటం, గొప్ప వ్యక్తిత్వం కలిగివుండటం వంటివి – మీరు అటువంటి మంచి పనులు చేసే సంభావ్యత కూడా పెరుగుతుంది. ఇది జ్ఞానము మరియు ఆనందము పొందేందుకు కావలసిన గొప్ప సామర్థ్యమును సాధించుటకు దారి తీస్తుంది. ఆ విధంగా మీరు ముక్తి వైపు ఒక్కొక్క అడుగు దగ్గరవుతారు.

ఇక ప్రతియొక్క చర్య (ఆలోచనలు, భావాలు సహా) ఈ ప్రక్రియ లో లెక్కించబడుతుంది. ఏదైనా ఒక పనిని కేవలం ఒక్కసారి చేసినా కూడా, మీరు వివేకులు లేదా అవివేకులు (మొద్దులు) అగుటకు మీరు ఆ పనిని చేసే సంభావ్యత పెరుగుతుంది. ఒక సగటు ఆత్మ ప్రతి క్షణం సత్కర్మలు మరియు దుష్కర్మల మధ్య ఊగిసలాడుతూ ఉండి, ఒక తాగుబోతులా కొన్ని అడుగులు వెనక్కి, ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తూ, ముక్తిని పొందటాన్ని ఆలస్యము చేసుకుంటుంది. అయితే ఒక యోగి అతని సంకల్ప బలాన్ని (ఇచ్ఛాశక్తిని) ఉపయోగించి దుష్కర్మలు చేయుటకు నిరాకరించి సక్రియాత్మకంగా (ప్రయత్నపూర్వకంగా) ఉన్నతమైన కర్మలను మాత్రమే ఆచరిస్తాడు. అది అతని గత దుష్కర్మలకు సంబంధించిన సంస్కారములను బలహీన పరచి మంచి సంస్కారములతో భర్తీ చేస్తుంది. క్రమక్రమంగా అన్ని చెడు సంస్కారముల బీజములను ఒక యోగి నాశనము చేస్తాడు. అది ఎటువంటి పరిస్థితులలోనైనా ఆ యోగి అసలు చెడు పనులను చేయలేని స్థితికి చేరుస్తుంది. ఆ విధంగా అతడు చెడు కర్మల సంస్కారాలను దహించి వేసి, చెడు కార్యములు చేయుటకు కారణమైన చెడు సంస్కారముల ఉచ్చు నుండి బయట పడతాడు. వెనుకడుగు వేయనటువంటి ఒక సైనికుడి వలె ముక్తి వైపునకు సూటిగా పయనిస్తాడు. అతడు ఈశ్వరేచ్ఛకు శరణాగతుడై, ఈశ్వరుడి ఆనందమును పొందుతాడు.

ఈ సంస్కారముల బీజములను రూపుమాపే ప్రక్రియకు, తగినంత సమయం వరకు, చాలా ఆసక్తితో కూడిన నిర్విరామ ప్రయత్నం, ఈశ్వరుడి పై విశ్వాసం మరియు నమ్మకం అవసరమౌతాయి.

Bouncing ball code

(っ◔◡◔)っ Thank you for visiting my site

Download My App
Click Here
Share My URL
Youtube Channal
Subcribe Here

𝕐𝕠𝕦𝕣 𝕚𝕟𝕗𝕠𝕣𝕞𝕒𝕥𝕚𝕠𝕟 𝕙𝕖𝕣𝕖

You have oppend this site in mobile Device
United States United States
Mozilla/5.0
18.224.246.203
© KINGOFTELUGU.WAP.SH 2024
Online counter 1
Total