
ఆదిమ మానవులు మొదటగా జంతువుల మాంసం, దుంపలు, కాయలు, పండ్లు మొదలైన వాటిని ఆహారంగా తీసుకునేవారు. కొంత కాలమైన తర్వాత నెమ్మదిగా వ్యవసాయ పద్ధతులు నేర్చుకుని కొద్ది మొత్తంలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు.
ఆధునిక పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పప్పుదినుసులు మొదలైన ఆహార పదార్థాలు, పశుపోషణ మొదలైన వృత్తులు క్రీపూ 7000 లోనే మధ్యధరా ప్రాంతానికి చెందిన దేశాల్లో బాగా వ్యాప్తి చెంది ఉండేవి.. క్రీ.పూ 3000 నాటికి ఈజిప్షియన్లు, మెసపుటేమియన్లు పెద్ద ఎత్తున వ్యవసాయ పద్ధుతులు, ఎరువుల వాడకం, సాగునీటి పద్ధతులు చేపట్టారు.
వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది.
ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు అందుచేత వ్యవసాయం, ప్రపంచములోనే అధిక శాతం ప్రజల యొక్క వృత్తి. అయితే వ్యవసాయ ఉత్పత్తి ప్రపంచ ఉత్పాదనలో (అన్ని దేశాల సమష్టి ఉత్పాదనల కూడిక) కేవలం 5% మాత్రమే.
📖 Annadata Book October 2018
📖 Annadata Book November 2018
📖 Annadata Book December 2018
📖 Annadata Book January 2019
📖 Annadata Book April 2019
📖 Annadata Book November 2019
📖 Annadata Book Dec-2019
📖 Annadata Book Jan-2020
📖 Kalupu Mokkala Rasayana Niyantrana